శనివారం 06 మార్చి 2021
National - Nov 25, 2020 , 18:57:31

లక్ష్మీ విలాస్ బ్యాంకు విలీనం పై కేంద్రం కీలక నిర్ణయం...

లక్ష్మీ విలాస్ బ్యాంకు విలీనం పై కేంద్రం కీలక నిర్ణయం...

న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుని పోయిన లక్ష్మీ విలాస్ బ్యాంకు విలీనంపై కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాన్ని తీసుకున్నది. భారతీయ రిజర్వుబ్యాంకు నుంచి మారటోరియాన్ని ఎదుర్కొంటోన్న ఆ బ్యాంకును డీబీఎస్‌లో విలీనం చేస్తారంటూ కొద్దిరోజులుగా వార్తలు వెలువడుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అందరి దృష్టీ కేంద్ర ప్రభుత్వంపై నిలిచింది. అదే సమయంలో దేశ రాజధానిలో కేంద్ర మంత్రివర్గం సమావేశం కావడం వల్ల.. విలీన ప్రతిపాదనలపై ఆమోదం లభిస్తుందని అందరూ ఆశించారు.

ఊహించినట్టే- లక్ష్మీ విలాస్ బ్యాంకును డీబీఎస్‌లో విలీనం చేయడానికి కేంద్రం అంగీకరించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఒకరకంగా చెప్పాలంటే- ఈ ఆమోదంతో విలీన ప్రక్రియ ఆరంభమైనట్టే. దీనితో పాటు ఖాతాదారులకు మరో శుభవార్తను వినిపించింది కేంద్ర కేబినెట్. ఇకపై ఖాతాదారులు.. తాము డిపాజిట్ చేసిన మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవడంపైఆంక్షలు ఉండబోవని కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo