శుక్రవారం 29 మే 2020
National - Jan 16, 2020 , 14:45:04

కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి బొమ్మను ముద్రించాలి

కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి బొమ్మను ముద్రించాలి

న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రమణ్య స్వామి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి బొమ్మను ముద్రించాలని ఆయన ట్విట్టర్‌ ద్వారా తెలిపాడు. భారత ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే అక్ష్మీదేవి బొమ్మను నోట్లపై ముద్రించాలన్నారు. ఇండోనేషియా కూడా గణేషుడి బొమ్మను వారి కరెన్సీ నోట్లపై ముద్రించిందని ఆయన గుర్తు చేశారు. కాగా, ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. బీజేపీ మతతత్వ పార్టీ అనడానికి ఇదొక నిదర్శనం అని విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ సందర్భాన్ని ఉటంకిస్తూ ఎన్‌ఆర్‌సీ, సీఏఏను ఉదాహరణగా చూపిస్తున్నాయి విపక్షాలు. ఆయన మాత్రం సిటిజన్ షిప్ యాక్ట్ కు, దీనివల్ల ఎలాంటి అభ్యంతరం ఉండదని ఆయన అన్నారు. ఇంతకు ముందు కూడా ఆయన చాలా సందర్భాల్లో వివాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయిన విషయం తెలిసిందే.


logo