మంగళవారం 07 జూలై 2020
National - May 25, 2020 , 15:18:42

కరోనా కాలు మోపని ప్రదేశం తెలుసా?

కరోనా కాలు మోపని ప్రదేశం తెలుసా?

న్యూఢిల్లీ: చైనా నుంచి గత ఏడాది డిసెంబర్‌లో ప్రారంభమై దేశవిదేశాలను చుట్టివచ్చిన కరోనా వైరస్‌.. భారత్‌ను కూడా పట్టి పీడిస్తోంది. భారత్‌లోని అన్నిప్రాంతాల్లో కరోనా వైరస్‌ కేసులు నమోదవుతున్నప్పటికీ.. ఒక్క ప్రాంతంలో మాత్రం ఇప్పటివరకు దాని జాడే లేకపోవడం విశేషం. అదెక్కడో కాదు.. మన కేంద్ర పాలిత ప్రాంతమైన లక్ష్వద్వీప్‌లో. గత 60 రోజులుగా భారత్‌ను కుదిపేస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తి ఇక్కడ లేదని అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. నిన్నమొన్నటి వరకు నాగాలాండ్‌లో కూడా ఒక్క పాజిటివ్‌ కేసు నమోదు కాలేదు. అయితే, సోమవారం జరిపిన పరీక్షల్లో మూడు పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కావడంతో తొలి కేసు నమోదైనట్టయింది. అందుకే ఇంతవరకు కరోనా కాలు మోపలేదు అని నిక్కచ్చిగా చెప్పవచ్చు. 

36 ద్వీపాలతో కూడిన అందమైన ద్వీపసమూహంగా అలరారుతున్న లక్ష్వద్వీప్‌లో దాదాపు 64 వేల జనాభా ఉన్నది. కేరళ తీరం వెంబడి ఉన్న ఈ కేంద్రపాలిత ప్రాంతం.. దాని అవసరాల కోసం దక్షిణాది రాష్ట్రాలపై ఆధారపడి ఉంటుంది. పచ్చని చెట్లు, చుట్టూ సముద్రంతో కనువించు చేసే ఈ ద్వీపకల్పంలో ఇప్పటివరకు ఒక్క పాజిటివ్‌ కేసు కూడా  నమోదు కాలేదు. నిన్నటివరకు జీరో కేసులుగా ఉన్న నాగాలాండ్‌లో చెన్నై నుంచి శ్రామిక్‌ రైళ్లో వచ్చిన వలస కార్మికులు ముగ్గురిలో పాజిటివ్‌ బయటపడింది. సిక్కింలో కూడా శనివారమే తొలి కేసు నమోదైనట్లు సమాచారం. ఇక్కడ పాజిటివ్‌గా  తేలిన వ్యక్తి ఢిల్లీ నుంచి తిరిగివచ్చిన  25 ఏండ్ల విద్యార్థిగా గుర్తించారు. ఈయనతో కలిసిన 17 మందికి పరీక్షలు జరుపగా అందరికీ నెగెటివ్‌గా నివేదికలు వచ్చాయి. అరుణాచల్‌ప్రదేశ్, దాద్రా నగర్‌ హవేలీల్లో ఒక్కొక్కటి చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 


logo