శనివారం 30 మే 2020
National - May 08, 2020 , 19:27:27

లేడీ అర్నాబ్.. దాదాసాహెబ్ ఫాల్కే ఇవ్వాలట!

లేడీ అర్నాబ్.. దాదాసాహెబ్ ఫాల్కే ఇవ్వాలట!

రిపబ్లిక్‌ టీవీ వ్యవస్థాపకుడు, ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్‌ గోస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీవీ డిబేట్లలో ఆవేశంతో ఊగిపోతుంటారు. పెద్దగా అరుస్తూ ప్రశ్నకు జవాబు చెప్పకుండానే ఎదుటి వాళ్లను భయపెట్టేస్తుంటారు. అర్నబ్‌ను అనుస‌రిస్తున్న‌మ‌హిళ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అర్నాబ్ ఎలా అయితే మాట్లాడుతాడో అలానే ఇమిటేట్ చేస్తున్న‌ది. న‌ల్ల‌టి బ్లేజ‌ర్ ధ‌రించి ఆర్నాబ్ గోస్వామి స్టైల్‌లో మాట్లాడుతున్నది. ఈ పేర‌డీ వీడియోను ఒక జ‌ర్న‌లిస్ట్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు.  "OMG! ఎవరు ఇలా చేసారు? దేశం తెలుసుకోవాలనుకుంటున్న‌ది' అనే క్యాప్ష‌న్‌తో పోస్ట్ చేశారు. దీనిని చూసిన వారంద‌రూ ఈ 'లేడీ అర్నాబ్' కు 'దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు' కూడా ఇవ్వాలి అని కామెంట్లు పెడుతున్నారు.logo