ఆదివారం 28 ఫిబ్రవరి 2021
National - Jan 26, 2021 , 11:21:13

రిప‌బ్లిక్ డే ప‌రేడ్‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా ల‌ఢ‌ఖ్ శ‌క‌టం

రిప‌బ్లిక్ డే ప‌రేడ్‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా ల‌ఢ‌ఖ్ శ‌క‌టం

  • కేంద్ర‌పాలిత ప్రాంతం నుంచి గ‌ణ‌తంత్ర వేడుక‌ల్లో ప్ర‌ద‌ర్శిత‌మైన తొలి శ‌క‌టంగా గుర్తింపు

న్యూఢిల్లీ: ‌ఢిల్లీలో 72వ గ‌ణ‌తంత్ర వేడుక‌ల సంద‌ర్భంగా జ‌రిగిన శ‌క‌టాల ప్ర‌ద‌ర్శ‌న‌లో ల‌ఢ‌ఖ్ శ‌క‌టం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ప‌రేడ్‌లో ల‌ఢ‌ఖ్ శ‌క‌టం ముందుగా వెళ్తుండ‌గా ఇత‌ర రాష్ట్రాల శ‌క‌టాలు దానిని అనుస‌రించాయి. ల‌ఢ‌ఖ్‌లోని ల‌లిత క‌ళ‌లు వాస్తుక‌ళ‌, భాష‌లు యాస‌లు, అచార వ్య‌వ‌హారాలు, ఉత్స‌వాలు పండుగ‌లు, సాహిత్యం, సంగీతంతోపాటు ఆ ప్రాంత సంస్కృతి, మ‌త‌సామ‌ర‌స్యం ఉట్టిప‌డేలా శ‌క‌టాన్ని రూపొందించారు. గ‌ణ‌తంత్ర దినోత్స‌వ ప‌రేడ్‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణగా నిలిచిన ల‌ఢ‌ఖ్ శ‌క‌టానికి మ‌రో ప్ర‌త్యేక గుర్తింపు కూడా ల‌భించింది. ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి రిప‌బ్లిక్ డే వేడుక‌ల్లో ప్ర‌ద‌ర్శిత‌మైన తొలి శ‌క‌టంగా ఈ ల‌ఢ‌ఖ్ శ‌క‌టం గుర్తింపు పొందింది.             

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo