సోమవారం 01 జూన్ 2020
National - May 11, 2020 , 06:54:52

రాళ్లు రువ్విన కార్మికులు..పోలీసుల‌కు గాయాలు

రాళ్లు రువ్విన కార్మికులు..పోలీసుల‌కు గాయాలు

తిరువ‌నంత‌పురం: కేర‌ళ‌లో వ‌ల‌స‌కార్మికులు, పోలీసులకు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణ నెల‌కొంది. ఒరువ‌తి కొట్టాలో 700 మంది వ‌ల‌స కార్మికులు త‌మ‌ను సొంతూళ్ల‌కు పంపించేందుకు ఏర్పాట్లు చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే పోలీసులు వ‌ల‌స కార్మికులన ఆందోళన విరమించేలా న‌చ్చజెప్పేందుకు ప్ర‌య‌త్నించారు.

కార్మికులు ఒక్క‌సారిగా పోలీసుల‌పైకి రాళ్లు రువ్వారు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు పోలీసుల‌కు గాయాల‌య్యాయి. ఇద్ద‌రినీ చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo