శనివారం 24 అక్టోబర్ 2020
National - Sep 26, 2020 , 16:53:25

కెవిఐసి సలహాదారుగా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సునీల్ సేథీ

 కెవిఐసి సలహాదారుగా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సునీల్ సేథీ

ఢిల్లీ : ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సునీల్ సేథీ ను తమ సలహాదారుగా నియమిస్తున్నట్లు ఖాదీ గ్రామోద్యోగ కమిషన్ ప్రకటించింది. రెడీమేడ్ వస్త్రాల తయారీలో సరికొత్త డిజైన్ల తయారీపై సలహాలు ఇవ్వడంతో పాటు దేశంలోనేకాకుండా విదేశాలలో ఖాదీని ప్రోత్సహించడానికి కమిషన్ కు సేథీ సలహాలు ఇవ్వనున్నారు.సేథీ ఆ పదవిలో ఒక ఏడాది పాటు ఉంటారని కెవిఐసి ఓ ప్రకటనలో తెలిపింది. ఇంతకు ముందు  ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రీతూ బేరీ ఆ  కెవిఐసి సలహాదారు పదవిలో  ఉండేవారు. ఆమె పదవీకాలం ఇటీవలే పూర్తయ్యింది. దీంతో  ఈ అవకాశం ఆయనకు దక్కింది.

సేథీకి ప్రపంచ దేశాలతో వర్తకంలో నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్నది. అనేక వినూత్న,విజయవంతమైన ప్రయత్నాల ద్వారా ఆయన భారతీయ హస్తకళలు, డిజైన్ , జౌళి పరిశ్రమ అభివృద్ధికి అర్థవంతమైన తోడ్పాటును అందించారని కమిషన్ పేర్కొన్నది. 400 మంది డిజైనర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫ్యాషన్ డిజన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా సేవలందించారు. అంతే కాదు భారతీయ ఫ్యాషన్ పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు సేథీ ఎంతో కృషి చేశారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. logo