ఆదివారం 29 మార్చి 2020
National - Mar 25, 2020 , 13:57:11

కేవీల‌లో విద్యార్థుల‌కు ప‌రీక్ష లేకుండా ప్ర‌మోట్ !

కేవీల‌లో విద్యార్థుల‌కు ప‌రీక్ష లేకుండా ప్ర‌మోట్ !

దేశంలోని కేంద్రీయ విద్యాల‌యాల‌లో చ‌దువుతున్న 1-8 త‌ర‌గ‌తి విద్యార్థులంద‌రినీ వార్షిక ప‌రీక్ష‌లు రాయ‌కుండానే త‌ర్వాతి ప‌రీక్ష‌ల‌కు ప్ర‌మోట్ చేస్తున్న‌ట్లు కేంద్రీయ విద్యాల‌య‌ స‌మితి ప్ర‌క‌టించింది. 1,2 త‌ర‌గ‌తుల విద్యార్థుల‌ను నేరుగా ప్ర‌మోట్ చేసిన‌ట్లు కేవీఎస్ తెలిపింది. ఇక 3-8 త‌ర‌గ‌తి విద్యార్థుల‌ను ఈ ఏడాది చివ‌ర‌గా రాసిన ప‌రీక్ష‌ల‌లో వ‌చ్చిన మార్కుల ఆధారంగా ప్ర‌మోట్ చేస్తున్న‌ట్లు తెలిపింది. విద్యార్థుల ఫ‌లితాల‌ను వారి త‌ల్లిదండ్రుల‌కు వాట్స‌ప్ ద్వార పంపించారు.  అయితే ఈ గ్రేడ్ వ‌చ్చిన విద్యార్థులు మాత్రం పాఠ‌శాల‌లు తెరిచిన త‌ర్వాత నిర్వ‌హించే ఇంప్రూవ్‌మెంట్ ప‌రీక్ష‌లు రాయాల్సి ఉంటుంది.logo