శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
National - Feb 23, 2021 , 18:24:54

బెంగాల్‌లో దోస్తీ కేర‌ళ‌లో కుస్తీనా..?: కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాలపై కేంద్ర ‌మంత్రి ఫైర్‌

బెంగాల్‌లో దోస్తీ కేర‌ళ‌లో కుస్తీనా..?: కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాలపై కేంద్ర ‌మంత్రి ఫైర్‌

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఎజెండాతో ఉంటుందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీతోపాటే ప‌లు ఇత‌ర పార్టీలు కూడా రెండు నాల్కల ధోరణినే అవ‌లంభిస్తున్నాయ‌ని ఆయన విమర్శించారు. ఒక్క బీజేపీ మాత్రమే దేశంలోని ఏ ప్రాంతంలోనైనా ఒకే నినాదంతో, ఒకే ఎజెండాతో పనిచేస్తున్న‌ద‌ని చెప్పారు. మంగళవారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్ర‌హ్లాద్ జోషి మాట్లాడారు.

'ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ కూట‌ములు కేరళలో కుస్తీకి దిగుతాయి. ఈ రెండు కూట‌ముల్లోని ప్ర‌ధాన పార్టీలైన కాంగ్రెస్, వామ‌ప‌క్షాలు ఢిల్లీ, బెంగాల్‌, బీహార్ త‌దిత‌ర రాష్ట్రాల్లో దోస్తీ చేస్తాయి. మమతాబెనర్జీ కూడా అంతే, ఢిల్లీలో కాంగ్రెస్‌కు మద్దతిస్తారు. బెంగాల్‌లో కుస్తీ పడుతారు. ఇదేం విచిత్రం..? ఈ పార్టీల ఎజెండా ఏమిటి..? ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఎందుకు వ్యవహరిస్తున్నాయి...? ఈ రెండు నాల్కల ధోరణి ఎందుకు..? ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి విచిత్రమైన రాజకీయాలు ఏమిటి?' అని ప్రహ్లాద్ జోషి ప్ర‌శ్నించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo