గురువారం 06 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 15:28:03

నేనేమీ బీజేపీలో చేర‌డంలేదు: ‌కుష్బూ

నేనేమీ బీజేపీలో చేర‌డంలేదు: ‌కుష్బూ

చెన్నై: ‌తానేమీ బీజేపీలో చేర‌డంలేద‌ని త‌మిళ‌నాడుకు చెందిన ప్ర‌ముఖ న‌టి, కాంగ్రెస్ నాయ‌కురాలు కుష్భూ ప్ర‌క‌టించారు. కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదించిన నూత‌న జాతీయ విద్యావిధానం-2020ని కుష్బూ స్వాగ‌తించారు. దీనిపై కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు సోష‌ల్ మీడియా వేదిక‌గా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. కుష్బూ ప్ర‌తిప‌క్ష నాయ‌కురాలై ఉండి ప్ర‌భుత్వ విధానాల‌ను స‌మ‌ర్థించ‌డంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అటు బీజేపీ మద్దతుదారులు సైతం నూత‌న జాతీయ విద్యావిధానంపై కుష్బూ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. 

ఈ నేప‌థ్యంలో మ‌రోసారి స్పందించిన కుష్బూ 'శాంతించండి.. శాంతించండి. సంఘీయులారా శాంతిచండి. సంతోషించకండి. నేనేమీ బీజేపీలో చేరడం లేదు. మా పార్టీ విధానంతో నేను విభేదించింది నిజమే. అయితే నా వ్యక్తిగత అభిప్రాయాన్ని మాత్రమే చెప్పా. జాతీయ విద్యావిధానం-2020లో కొన్ని లోపాలుండవచ్చు. కానీ మార్పును సానుకూల దృక్పథంతో చూడాలన్నది నా భావన. నేను కేవలం పాజిటివ్ అంశాలనే చూస్తా. సమస్యలకు మార్గం వెతకాలి కానీ అనవసరంగా విమర్శలకు దిగితే లాభంలేదు. ప్రతిపక్షం కూడా దేశ భవిష్యత్తు కోసమే పని చేయాలి' అని పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo