శుక్రవారం 03 జూలై 2020
National - Jun 15, 2020 , 11:36:48

సుదీర్ఘ విరామం త‌ర్వాత తెరుచుకున్న ఆశ్ర‌మం

సుదీర్ఘ విరామం త‌ర్వాత తెరుచుకున్న ఆశ్ర‌మం

  • లాక్‌డౌన్ కార‌ణంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో మూత‌ప‌డ్డ క‌రుణ‌ధామ్‌
  • 84 రోజుల త‌ర్వాత పునఃప్రారంభం 
  • ప్రార్థ‌న‌లు చేసిన సీఎం శివ‌రాజ్‌సింగ్

భోపాల్‌: ‌క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణ కార‌ణంగా గ‌త మార్చి 24 నుంచి దేశమంత‌టా లాక్‌డౌన్ అమ‌ల్లోకి వ‌చ్చింది. దీంతో అత్య‌వ‌స‌రాలు, నిత్య‌వ‌స‌రాల‌కు సంబంధించిన‌వి త‌ప్ప అన్ని ర‌కాల వ్యాపార, వాణిజ్య కార్య‌క‌లాపాలు మూత‌ప‌డ్డాయి. ఆల‌యాలు , ఆశ్ర‌మాల్లో భ‌క్తుల సంద‌ర్శ‌న‌లు నిలిచిపోయాయి. మొద‌టి విడ‌త‌ల్లో క‌ఠినంగా లాక్‌డౌన్‌ను అమ‌లు చేసిన కేంద్రం.. నాలుగో విడ‌త నుంచి స‌డ‌లింపులు ఇస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు మార్గ‌ద‌ర్శ‌కాలు జారీచేస్తున్న‌ది. 

ఈ స‌డ‌లింపుల్లో భాగంగానే మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ‌ధాని భోపాల్‌లోని క‌రుణ‌ధామ్ ఆశ్ర‌మం సోమ‌వారం తెరుచుకున్న‌ది. ఎన‌భై నాలుగు రోజుల సుదీర్ఘ విరామం త‌ర్వాత ఆశ్ర‌మంలోకి భ‌క్తుల ప్ర‌వేశానికి అనుమ‌తి ల‌భించ‌డంతో.. మ‌ధ్యప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు ఉద‌యం ఆ ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించారు. అక్క‌డ ప్రార్థ‌న‌లు నిర్వహించారు.    logo