శనివారం 24 అక్టోబర్ 2020
National - Sep 19, 2020 , 18:17:53

12 ఏండ్ల కోసారి మాత్రమే వికసించే పువ్వులు

 12 ఏండ్ల కోసారి మాత్రమే వికసించే పువ్వులు

భోపాల్: పువ్వుల్లో అరుదైనవి ఉంటాయి. అటువంటి వాటిలో ఈ పువ్వులు చాలా ప్రత్యేకమైనవి. మధ్యప్రదేశ్ లోని పచ్ మరి ప్రాంతంలో 12ఏండ్ల తరువాత నీల్ కురుంజి పుష్పాలు వికసించాయి. ఈ పువ్వులు 12 ఏండ్లకు ఒకసారి మాత్రమే వికసిస్తుంటాయి. మధ్యప్రదేశ్ లోని పచ్ మరి, తమిళనాడు, కేరళ తదితర ప్రాంతాల్లో ఈ పుష్పాలు పూస్తుంటాయి. ఈ పుష్పాలు 2006 వ సంవత్సరంలో చివరిసారిగా కేరళ ప్రాంతంలో పుష్పించాయి. మరలా ఇప్పుడు మధ్యప్రదేశ్ లో వికసించాయి. పుష్కరానికి ఒకసారి పువ్వులు వికసిస్తుంటాయి. పువ్వులు వికసించిన తరువాత వాటి నుంచి విత్తనాలుగా మారుతాయి. మరలా విత్తనాలు మొక్కలుగా పెరిగి 12 ఏండ్ల తరువాత పుష్పిస్తుంటాయి. అయితే, ఈ పువ్వుల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. వీటి నుంచి అనేక రకాల ఆయుర్వేద ఉత్పత్తులను తయారు చేస్తుంటారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo