సోమవారం 18 జనవరి 2021
National - Nov 29, 2020 , 15:58:50

రైల్వే స్టేష‌న్ల‌లో ఇక మ‌ట్టి క‌ప్పుల్లో చాయ్‌

రైల్వే స్టేష‌న్ల‌లో ఇక మ‌ట్టి క‌ప్పుల్లో చాయ్‌

జైపూర్‌: రైల్వే స్టేష‌న్ల‌లో ఇక నుంచి ప్లాస్టిక్ క‌ప్పులు క‌నిపించ‌వు. కుల్హాద్‌గా పిలిచే మ‌ట్టి క‌ప్పుల్లో టీ ఇవ్వ‌నున్న‌ట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ చెప్పారు. వాయ‌వ్య రైల్వేలో కొత్త‌గా విద్యుదీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ధిగ్వారా-బండికుయి సెక్ష‌న్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రైల్వే స్టేష‌న్‌ల‌లో మ‌ట్టి క‌ప్పులను వాడ‌టం ద్వారా దేశాన్ని ప్లాస్టిక్ ర‌హితంగా మార్చ‌డానికి ఇండియ‌న్ రైల్వేస్ త‌న వంతు పాత్ర పోషిస్తుంద‌ని గోయ‌ల్ అన్నారు. ప్ర‌స్తుతం దేశంలోని 400 స్టేష‌న్ల‌లో మాత్ర‌మే మ‌ట్టిక‌ప్పుల్లో చాయ్ ఇస్తున్నార‌ని, భ‌విష్య‌త్తులో దేశంలోని అన్ని స్టేష‌న్ల‌లో ఇవే ఏర్పాట్లు చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నామ‌ని ఆయ‌న చెప్పారు. వీటి వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణానికి మేలు జ‌ర‌గ‌డంతోపాటు ల‌క్ష‌ల మందికి ఉపాధి కూడా క‌లుగుతుంద‌ని పీయూష్ గోయ‌ల్ అన్నారు.