మంగళవారం 31 మార్చి 2020
National - Mar 13, 2020 , 15:35:37

ఉన్నావ్‌ కేసు.. కుల్‌దీప్‌సింగ్‌ సెంగార్‌కు పదేళ్ల జైలు

ఉన్నావ్‌ కేసు.. కుల్‌దీప్‌సింగ్‌ సెంగార్‌కు పదేళ్ల జైలు

ఢిల్లీ : ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి తండ్రి హత్య కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్‌దీప్‌సింగ్‌ సెంగార్‌కు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు తీర్పు వెలువరించింది. అతని సోదరుడు అతుల్‌ సింగార్‌కు కూడా ఇదే విధమైన శిక్షను విధించింది. అదేవిధంగా బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని కుల్‌దీప్‌సింగ్‌ సెంగార్‌, అతని సోదరుడిని కోర్టు ఆదేశించింది. 2017లో ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఎమ్మెల్యే కుల్‌దీప్‌సింగ్‌ సెంగార్‌  ఓ మైనర్‌ను అత్యాచారం చేశాడు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధితురాలి తండ్రిని నేరపూరితంగా తప్పుగా ఆయుధాల చట్టం కింద కేసులో ఇరికించారు.  9 ఏప్రిల్‌,2018న జూడిషియల్‌ కస్టడిలో ఉండగానే మృతిచెందాడు. 


logo
>>>>>>