ఆదివారం 29 మార్చి 2020
National - Feb 22, 2020 , 14:37:40

తృణమూల్‌ మాజీ ఎంపీ కన్నుమూత

తృణమూల్‌ మాజీ ఎంపీ కన్నుమూత

కోల్‌కతా : తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ ఎంపీ కృష్ణ బోస్‌(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ శనివారం ఉదయం 10:20 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొద్ది రోజుల క్రితం ఆమెకు గుండెపోటు రావడంతో.. సర్జరీ చేశారు. కృష్ణ బోస్‌ మృతిపట్ల తృణమూల్‌ పార్టీ నాయకులు సంతాపం ప్రకటించారు. సుభాష్‌ చంద్రబోస్‌ మేనల్లుడు శిశిర్‌ కుమార్‌ బోస్‌ను కృష్ణ బోస్‌ పెళ్లి చేసుకున్నారు. 1996, 1998, 1999లో జాదవ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు కృష్ణ బోస్‌ ఎన్నికయ్యారు. ఈమెకు ఇద్దరు కుమారులు సుగత, సుమంత్ర, కుమార్తె షర్మిల ఉన్నారు. 


logo