మంగళవారం 14 జూలై 2020
National - May 06, 2020 , 17:17:50

నృసింహ జ‌యంతి.. క్రిష్ అద్భుత క‌విత‌

నృసింహ జ‌యంతి.. క్రిష్ అద్భుత క‌విత‌

విష్ణుమూర్తి యొక్క దశావతారాలలోని 4వ అవతారమే నరసింహస్వామి. నృసింహ జయంతి(న‌ర‌సింహస్వామి జ‌యంతి) వైశాఖ శుక్ల చతుర్ధతి నాడు జరుపుకొంటారు. నరసింహస్వామి రూపంలో దేహం మానవ రూపం, తల సింహం రూపంలో అవతరించిన దేవుడు.నృసింహస్వామి మాహా శక్తి వంతమైన దేవుడు. ఈ రోజున విష్ణుమూర్తి హిరణ్యకశిపుడిని సంహరించి, ధర్మాన్ని నిలబెట్టాడు కాబట్టి నృసింహ జయంతిని వేడుకగా జరుపుకొంటారు. 

నృసింహ జయంతి సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు క్రిష్‌, గుణ శేఖ‌ర్ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు. ముఖ్యంగా క్రిష్ అద్భుత‌మైన క‌విత‌తో ఆక‌ట్టుకున్నాడు. ఏడీ ఎక్కడ రా నీ హరి..దాక్కున్నాడేరా భయపడి? .. బయటకు రమ్మనరా ఎదటపడి

నన్ను గెలవగాలడా తలబడి?.. నువ్వు నిలిచిన ఈ నేలని అడుగు .. నీ నాడుల జీవజలమ్ముని అడుగు.. నీ నెత్తుటి వెచ్చదనాన్నడుగు .. నీ ఊపిరిలో గాలిని అడుగు.. నీ అడుగుల ఆకాశాన్నడుగు .. నీలో నరునీ హరినీ కలుపు..  నీవే నరహరి వని నువు తెలుపు అంటూ త‌న‌లోని క‌వి హృద‌యాన్ని బ‌య‌ట‌కి తీసారు.


logo