మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 06, 2020 , 00:56:19

రసవత్తరంగా నేపాల్‌ రాజకీయం

రసవత్తరంగా నేపాల్‌ రాజకీయం

  • పొత్తు చర్చలు విఫలం

కఠ్మాండు: భారత్‌ వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తున్న నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలీ తీరుతో నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ (ఎన్సీపీ)లో అంతర్గత సంక్షోభం నెలకొంది. ఎన్పీసీ నేతలే ఆయనను వైదొలగాలని డిమాండ్లు చేస్తున్నారు. అందుకు కేపీ శర్మ ఓలీ ససేమిరా అంటున్నారు. ఆదివారం ఎన్సీపీ సీనియర్‌ నేత పుష్ప కమల్‌ దహల్‌ ఓలీతో సమావేశమయ్యారు. వారిద్దరి మధ్య మలి విడుత భేటీ సోమవారం జరుగనున్నట్లు సమాచారం. ప్రధానిని కలువడానికి ముందే ఆయన దేశాధ్యక్షురాలు బింద్యాదేవి భండారితో చర్చించారని వార్తలొచ్చాయి. ఎన్సీపీ స్టాండింగ్‌ కమిటీ సమావేశం సోమవారం జరుగనున్నది. ప్రధానిగా ఓలీ వైదొలుగక పోతే ఎన్సీపీ పార్టీ నిట్ట నిలువునా చీలిపోనున్నదని తెలుస్తున్నది.


logo