శనివారం 26 సెప్టెంబర్ 2020
National - Aug 08, 2020 , 09:55:57

కోజికోడ్‌ ప్రమాద నివారణకు తీవ్ర ప్రయత్నం చేసిన పైలట్లు

కోజికోడ్‌ ప్రమాద నివారణకు తీవ్ర ప్రయత్నం చేసిన పైలట్లు

కేరళ : దుబాయ్ నుంచి వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం శుక్రవారం సాయంత్రం కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో రెండు భాగాలుగా కుప్పకూలింది. ఇందులో పైలట్లు సహా 20 మంది మృతి చెందారు. కోజికోడ్ ప్రమాదాన్ని నివారించడానికి దేశంలోని అత్యుత్తమ పైలట్లు కెప్టెన్ అఖిలేష్, దీపక్ సాతే తీవ్రంగా ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అయినా విమానాన్ని ప్రమాదం నుంచి తప్పించలేకపోయారని సమాచారం. 

ఈ ప్రమాదంలో మరణించిన వారిలో పైలట్-ఇన్-కమాండ్ కెప్టెన్ దీపక్ సాతే (59), కో-పైలట్ కెప్టెన్ అఖిలేశ్‌ కుమార్ (33) కూడా ఉన్నారు. దీపక్ సాతే భారత వైమానిక దళం (ఐఏఎఫ్) మాజీ వింగ్ కమాండర్, వైమానిక దళ విమాన పరీక్షా సంస్థలో కూడా ఈయన పనిచేశారు.

వైమానిక దళ నేపథ్యం, అతడి సమర్థవంతమైన విమానయాన అనుభవంతో కోజికోడ్‌లోని విమానాన్ని కాపాడటానికి దీపక్ చాలా ప్రయత్నాలు చేశాడని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నప్పటికీ విమానం ప్రమాదానికి గురైందని పేర్కొన్నారు. 

ఎయిర్ ఇండియా కోసం పనిచేసిన దీపక్ ఒకప్పుడు వైమానిక దళం అకాడమీకి మంచి క్యాడెట్‌గా పేరు పొందారు. దీపక్ సాథే తన పనితనానికి అకాడమీ నుంచి ప్రతిష్టాత్మక 'స్వోర్డ్ ఆఫ్ ఆనర్' అవార్డును కూడా అందుకున్నారు. వైమానిక దళం ఉద్యోగం తరువాత దీపక్ కమర్షియల్ సర్వీసెస్ ఆఫ్ ఎయిర్ ఇండియాలో చేరారు. పైలట్ దీపక్ సాతే తండ్రి సైన్యంలో బ్రిగేడియర్. అతడి సోదరుల్లో ఒకరు కార్గిల్ యుద్ధంలో అమరవీరుడైనట్లు తెలిసింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo