గురువారం 02 జూలై 2020
National - Jun 26, 2020 , 21:04:48

మాలాగసీ ప్రజలకు రాష్ట్రపతి కోవింద్‌ శుభాకాంక్షలు

మాలాగసీ ప్రజలకు రాష్ట్రపతి కోవింద్‌ శుభాకాంక్షలు

న్యూఢిల్లీ : మడగాస్కర్‌ 60వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆండ్రీ రాజొలినా, మాలాగసీ ప్రజలకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుభాకాంక్షలు తెలిపారు. తాను చివరిసారిగా 2018లో మడగాస్కర్‌లో పర్యటించినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ దేశంతో భారత్‌కు విడదీయలేని సంబంధం ఉందని రాష్ట్రపతి భవన్‌ అధికారిక ట్విట్టర్‌ పేజీలో ఆయన పేర్కొన్నారు. ఇరుదేశాల భాగస్వామ్యం ఎంతో ఉన్నతమైందని, శాంతి, సౌభ్రాతృత్వం భారత సముద్రం లోపల, బయట రక్షణలోనూ కలసికట్టు దృక్పథంతో పని చేస్తున్నాయని వెల్లడించారు. మడగాస్కర్‌ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.. ప్రజలంతా ఆరోగ్యం ఉండాలి. కరోనా సంక్షోభం నుంచి ఆ దేశం త్వరగా బయటపడ్డాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. logo