గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 06, 2020 , 02:15:38

మోదీ పర్యటన రద్దు

మోదీ పర్యటన రద్దు

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ పర్యటనపై  కొవిడ్‌-19 ప్రభావం పడింది. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో ఈ నెల 13 నుంచి ఇండో-ఈయూ సదస్సు జరుగాల్సి ఉన్నది. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కార్యక్రమం వాయిదా పడిందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌కుమార్‌ తెలిపారు. వైద్యాధికారుల సూచన మేరకు మోదీ తన పర్యటనను రద్దు చేసుకున్నారన్నారు. అదేవిధంగా ఇరాన్‌లోని భారతీయుల్లో ఎవరికీ వైరస్‌ సోకలేదని తెలిపారు. మన దేశానికి చెందిన నిపుణులు త్వరలో ఖోమ్‌ నగరంలో ల్యాబ్‌ ఏర్పాటుచేస్తారన్నారు. 


logo