శుక్రవారం 05 జూన్ 2020
National - May 17, 2020 , 06:54:29

దేశంలో కోవిడ్‌-19 మరణాలు 2,872

దేశంలో కోవిడ్‌-19 మరణాలు 2,872

ఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 90,927 మంది కరోనా వైరస్‌ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 53,946. కోవిడ్‌-19 కారణంగా ఇప్పటి వరకు దేశంలో 2,872 మంది చనిపోయారు. వ్యాధి నుంచి కోలుకుని 34,224 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,970 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వ్యాధి కారణంగా 103 మంది మృత్యువాతపడ్డారు. దేశంలో మహారాష్ట్ర అత్యధిక ప్రభావానికి గురైతుంది. శనివారం ఒక్కరోజే మహారాష్ట్రలో కోవిడ్‌-19 కారణంగా 67 మంది చనిపోయారు. ఇందులో ఒక్క ముంబయి నగరంలోనే 41 మంది చనిపోయారు. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 1,606 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కోవిడ్‌-19 కేసుల సంఖ్య 30,706కు చేరుకుంది.


logo