శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 27, 2020 , 12:08:49

ప్ర‌భుత్వ ఆదేశాలు ప‌ట్టించుకోని స‌బ్ కలెక్ట‌ర్..

ప్ర‌భుత్వ  ఆదేశాలు ప‌ట్టించుకోని స‌బ్ కలెక్ట‌ర్..

 కేర‌ళ:  క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు విదేశాల నుంచి వ‌చ్చిన వారిని అధికారులు క్వారంటైన్ కు త‌ర‌లిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే కొల్లామ్ స‌బ్ క‌లెక్ట‌ర్ అనుప‌మ్ మిశ్రా మాత్రం ప్ర‌భుత్వ ఆదేశాల‌ను ప‌ట్టించుకోలేదు. మార్చి 19 న విదేశాల నుంచి వ‌చ్చిన అనుప‌మ్ మిశ్రా కాన్పూర్ కు వెళ్లాడు. లాక్ డౌన్ అమ‌లులో ఉన్న నేప‌థ్యంలో  ఆదేశాల‌ను బేఖాత‌రు చేసి..ఇంట్లోనే ఉండ‌కుండా కాన్పూర్ కు వెళ్లిన అనుప‌మ్ మిశ్రా నిబంధ‌న‌ల‌ను ఉలంఘించిన‌ట్లు కొల్లాం క‌లెక్ట‌ర్ ప్ర‌భుత్వానికి ఓ నివేదిక స‌మ‌ర్పించారు. కేర‌ళ‌తోపా టుదేశ‌వ్యాప్తంగా పోలీసులు, అధికారులు ప్ర‌జ‌లు ఇండ్ల లో నుంచి బ‌య‌ట‌కు రాకుండా చ‌ర్య‌లు తీసుకుంటోన్న విష‌యం తెలిసిందే. 


logo