ఆదివారం 12 జూలై 2020
National - Jul 01, 2020 , 15:32:33

కలకత్తా కాలీఘాట్‌ ఆలయం పునఃప్రారంభం

కలకత్తా కాలీఘాట్‌ ఆలయం పునఃప్రారంభం

కోల్‌కతా : కరోనా లాక్‌డౌన్‌లో భాగంగా సుమారు 100 రోజుల తరువాత కలకత్తాలో ప్రసద్ధి గాంచిన కాలీఘాట్‌ ఆలయాన్ని బుధవారం పునఃప్రారంభించారు. ఉదయం 6 గంటలకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలను తెరిచారు. 

ప్రభుత్వ నిబంధనల ప్రకారం భౌతిక దూరం పాటిస్తూ దర్శనాలు చేసుకోవాలని ఆలయ చైర్మన్‌ భక్తులకు తెలియజేశారు. ఆలయ ద్వారం ఎదుట శానిటైజర్‌ పిచికారీ చేసే గుండాలను ఏర్పాటు చేశామని అందులో నుంచి భక్తులు రావాలని కోరారు. గర్భగుడిలోకి ప్రస్తుతం ఎవరినీ అనుమతించడం లేదన్నారు. 

ప్రతిరోజు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మళ్లీ సాయంత్రం 4 నుంచి 6.30గంటల వరకు మాత్రమే ఆలయం తెరచి ఉంటుంది. కేవలం 10 మంది భక్తులను మాత్రమే అనుమతించనున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo