కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో సెక్స్ వర్కర్ల కోసం ప్రత్యేక కరోనా టీకా శిబిరాన్ని శనివారం నిర్వహించారు. కోల్కతా మునిసిపల్ కార్పొరేషన్ సహకారంతో దర్బార్ మహిళా సమన్వయు కమిటీ ఈ టీకా శిబిరాన్ని సోనగాచిలో ఏర్పాటు చేసింది. పెద్ద ఎత్తున తరలి వచ్చిన సెక్స్ వర్కర్లు కరోనా టీకాలు వేయించుకున్నారు. కరోనాపై పోరాటానికి టీకానే వారికి ఏకైక ఆశ అని దర్బార్ మహిళా సమన్వయ కమిటీ చీఫ్ బిషాఖా లస్కర్ తెలిపారు. ఈ ప్రత్యేక టీకా శిబిరంలో సుమారు 300 మంది సెక్స్ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు వెల్లడించారు.