గురువారం 02 జూలై 2020
National - Jun 17, 2020 , 13:43:44

కార్టూన్ మాస్కుల‌తో పిల్ల‌ల్లో ఉత్సాహం!

 కార్టూన్ మాస్కుల‌తో పిల్ల‌ల్లో ఉత్సాహం!

క‌రోనా వ్య‌ప్తి కార‌ణంగా బ‌ర్త్‌డే పార్టీలు, ఫంక్ష‌న్ల‌ను ఆడంబ‌రంగా కాకుండా మాములుగా జ‌ర‌పుకుంటున్నారు. వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా విషెస్‌ తెలియ‌జేస్తున్నారు. ఎక్క‌డికి వెళ్లినా మాస్క్ ధ‌రించాలి. అయి‌తే పిల్ల‌లు మాస్కులు వేసుకోమ‌ని మారాం చేస్తుంటారు. ఎందుకంటే అవి సాదాసీదా ఉంటాయ‌ని. అదే క‌ల‌ర్‌ఫుల్‌గా మాస్కులు ఉంటే వ‌ద్ద‌న్నా ధ‌రిస్తారు. ఈ ప‌ద్ధ‌తినే ఫాలో అయింది కోల‌క‌త్తాకు చెందిన ప్రగ్యా జుంజువాలా. ఈమెకు 11 ఏండ్ల పాప పూన‌మ్ జుంజువాలా ఉంది. మాస్క్ ధ‌రించిందుకు ఇష్టం చూప‌క‌పోవ‌డంతో కార్టూన్ మాస్కుల‌ను కొనుగోలు చేసింది. డ్రెస్‌కు మ్యాచ్ అయ్యేలా ఈకార్టూన్ మాస్కులున్నాయి.

వీటిని చూడ‌గానే ఎవ‌రికైనా ధ‌రించాల‌నిపిస్తుంది. ఇలా ఇంట్లో ఉన్న‌ప్పుడే ఆన్‌లైన్ క్లాసులు, వీడియో కాన్ఫెరెన్స్‌ల‌కు మాస్కు‌లు అల‌వాటు చేస్తే రేపు స్కూల్‌కు వెళ్లేట‌ప్పుడు వాళ్లే పెట్టుకొని వెళ్తార‌ని ప్ర‌గ్యా స‌ల‌హా ఇస్తుంది. అంతేకాదు వీళ్లు ఇత‌రుల‌కు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాల‌నుకుంటే ఇలాంటి మాస్కుల‌నే ఇస్తున్నారు. త‌న కూతురినే కాకుండా ఇత‌ర పిల్ల‌ల‌కూ మాస్కుల ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న‌ది. కార్టూన్ మాస్కుల ధ‌ర రూ. 35 కంటే ఎక్కువ ఉండ‌వు.  N95, K95 వంటి మాస్కులు పిల్ల‌ల‌కు గాలి ఆడ‌కుండా చేస్తాయి. అందుక‌ని కోల‌క‌త్తాలోని ఒక షాపు పిల్ల‌ల‌కోసం ప్ర‌త్యేకంగా సాఫ్ట్‌గా ఉండే క్లాత్‌తో కార్టూన్ మాస్కులు త‌యారు చేస్తున్న‌ది. 


logo