గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 05, 2020 , 18:34:16

క్యాబ్ డ్రైవర్ వాయిస్ కు నెటిజన్లు ఫిదా..వీడియో వైరల్

క్యాబ్ డ్రైవర్ వాయిస్ కు నెటిజన్లు ఫిదా..వీడియో వైరల్

రోజూ ప్రయాణికులను గమ్యస్థానాలను చేరుస్తుంటారు క్యాబ్ డ్రైవర్లు. డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నవారిలో కొంతమందికి ఇతర టాలెంట్స్ కూడా ఉంటాయి. కోల్ కతా ఉబెర్ ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్ ఆర్యన్ సోని హిందూస్థాన్ క్లాసికల్ మ్యూజిక్ లిరిక్స్ పాడి..సూపర్బ్ అనిపించాడు. ఈ వీడియోను క్యాబ్ లో ప్రయాణిస్తున్న బృందా దాస్ గుప్తా షేర్ చేసింది. మీకు సంగీతమంటే ఇష్టమేనా అని నన్ను అడిగాడు. అవును. అని చెప్పగానే. నాకూ మ్యూజిక్ అంటే చాలా ఇష్టమంటూ ఆర్యన్ హిందూస్తాన్ క్లాసికల్ సాంగ్ ను పాడాడని..బృందాదాస్ గుప్తా చెప్పింది. క్యాబ్ డ్రైవర్ ఆర్యన్ సోని సింగింగ్ టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.  logo
>>>>>>