శనివారం 04 జూలై 2020
National - Jun 30, 2020 , 18:22:05

మొద‌టి క‌స్ట‌మ‌ర్‌కు 'బంగారు క‌త్తెర'‌తో హెయిర్‌కట్‌‌!

మొద‌టి క‌స్ట‌మ‌ర్‌కు 'బంగారు క‌త్తెర'‌తో హెయిర్‌కట్‌‌!

మ‌హారాష్ట్రలో 'మిషన్ బిగిన్ ఎగైన్'‌ పేరుతో జూన్ 28 నుంచి సెలూన్లు, బ్యూటీ పార్లర్‌లను తిరిగి తెరవడానికి ప్రభుత్వం అనుమతించింది. మూడు నెల‌ల‌పాటు మూత‌బ‌డిన క్షౌరశాలలు ఇప్పుడు మ‌ర‌లా కొత్త అవ‌తార‌మెత్తుతున్నాయి. ఇన్నిరోజులు క‌స్ట‌మ‌ర్లు లేక ఉపాధిని కోల్పోయిన వారంతా ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు.  అయినా.. క‌స్ట‌మ‌ర్లు వ‌స్తార‌ని భ‌రోసా ఇవ్వ‌లేం. క‌రోనా దెబ్బ అలాంటిది మ‌రి. అందుకే.. లాక్‌డౌన్ త‌ర్వాత మొద‌టిసారిగా వ‌చ్చిన క‌స్ట‌మ‌ర్‌ను అతిథి క‌న్నా ఎక్కువ‌గా గౌర‌వించి బంగారు క‌త్తెర‌తో హెయిర్ క‌ట్ చేశాడో య‌జ‌మాని.

కొల్హాపూర్‌‌కు చెందిన 52 ఏండ్ల రంభౌ సంక్‌పాల్ ఎంతో ఉత్సాహంతో క‌స్ట‌మ‌ర్‌ను ట్రీట్ చేశాడు. దీంతో క‌స్ట‌మ‌ర్ కూడా చాలా సంతోషించాడు. 'సెలూన్ల‌కు అనుమ‌తి ఇవ్వ‌డంతో మా అందరి ముఖాల్లో ఆనందానికి హ‌ద్దు లేదు. మాకు ఇది త‌ప్ప మ‌రే వృత్తి తెలియ‌దు. అందుకే చాలారోజుల త‌ర్వాత వ‌చ్చిన క‌స్ట‌మ‌ర్‌ను ఇలా స్వాగ‌తించాం అని బార్బ‌ర్ చెప్పుకొచ్చాడు'‌. ఈ క‌త్తెరను విలువైన లోహంతో త‌యారు చేశారు. దీనికి మంచి డిమాండ్ కూడా ఉందంటున్నారు. ప్ర‌భుత్వం నిర్దేశించిన విధంగానే అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామ‌ని అక్క‌డి వారంతా వాపోయారు. 


logo