మంగళవారం 07 ఏప్రిల్ 2020
National - Mar 15, 2020 , 11:56:59

మార్చి 20న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

మార్చి 20న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుపతి : తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఈ నెల 20వ తేదీ శుక్ర‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో మార్చి 23 నుండి 31వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. మార్చి 22న అంకురార్పణం జరుగనుంది. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

మార్చి 20న ఉదయం 6.30 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 10 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతిస్తారు. 

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

 తేదీ                                         ఉదయం                    సాయంత్రం

23-03-2020(సోమ‌)               ధ్వజారోహణం            పెద్దశేష వాహనం

24-03-2020(మంగ‌ళ‌)     చిన్నశేష వాహనం            హంస వాహనం

25-03-2020(బుధ‌)           సింహ వాహనం           ఉగాది ఆస్థానం, ముత్యపుపందిరి వాహనం.

26-03-2020(గురు)          కల్పవృక్ష వాహనం          సర్వభూపాల వాహనం

27-03-2020(శుక్ర‌)          పల్లకీ ఉత్సవం                  గరుడ వాహనం

28-03-2020(శ‌ని)         హనుమంత వాహనం           వసంతోత్సవం/గజ వాహనం

29-03-2020(ఆది)          సూర్యప్రభ వాహనం               చంద్రప్రభ వాహనం

30-03-2020(సోమ‌)           రథోత్సవం                           అశ్వవాహనం

31-03-2020(మంగ‌ళ‌)    పల్లకీ ఉత్సవం/చక్రస్నానం           ధ్వజావరోహణం.


logo