మంగళవారం 14 జూలై 2020
National - Jun 26, 2020 , 11:54:10

లాక్‌డౌన్ ఎఫెక్ట్ : ఖాళీగా ఉండ‌లేక 'బైబిల్' రాసిన టీచ‌ర్‌

లాక్‌డౌన్ ఎఫెక్ట్ :  ఖాళీగా ఉండ‌లేక 'బైబిల్' రాసిన టీచ‌ర్‌

క‌రోనా వ్యాప్తి కార‌ణంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు. ఇప్పుడు బ‌స్సులు, గుళ్లు, మాల్స్‌ అన్నీ తెరిన‌ప్ప‌టికీ స్కూల్క్‌కు మాత్రం ఇంకా అనుమ‌తి రాలేదు. దీంతో పిల్ల‌లు ఇంట్లోనే ఉండ‌గా, టీచ‌ర్లు ఖాళీగా ఉంటున్నారు. ప్రైవేట్ స్కూల్స్ వ‌ర్చువ‌ల్ క్లాసులు నిర్వ‌హిస్తున్నారు. గ‌వ‌ర్న‌మెంట్ టీచ‌ర్లు మాత్రం ఖాళీగానే ఉన్నార‌ని చెప్పొచ్చు. దీంతో వారికి ఏ మాత్రం పొద్దుపోవ‌డం లేదు. దీంతో కొత్త కొత్త ప్ర‌యోగాలు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ఇంట్లో ఖాళీగా ఉండ‌లేక ఓ టీచ‌ర్ ఏకంగా బైబిల్‌నే తిర‌గ‌రాసింది. కోచిలో నివ‌సిస్తున్న సెలినే లోపెజ్‌మ‌ద‌ర్ ఆఫ్ లైఫ్ చ‌ర్చ‌ల్‌లో టీచ‌ర్‌గా ప‌నిచేస్తున్నఆమె లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటిప‌ట్టునే ఉండాల్సి వ‌చ్చింది. ఖాళీగా ఉండ‌లేక‌ బైబిల్ రాయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ది. 480 పేజీల‌ను రోజుకు 8 నుంచి 10 గంట‌లు చొప్పున స‌మ‌యాన్ని కేటాయించి 90 రోజుల్లో బైబిల్ పూర్తి చేసింది. దీనికోసం రెండు డ‌జ‌న్లు పెన్నులు వాడిన‌ట్లు చెప్పుకొచ్చింది. ఈ బైబిల్‌ను పారిష్ చర్చికి అందించి భ‌క్తిని చాటుకున్న‌ది టీచ‌ర‌మ్మ‌.


 


logo