గురువారం 09 జూలై 2020
National - Jun 26, 2020 , 09:58:21

మాతృత్వం అంటేనే ప్ర‌కృతి.. ప్ర‌కృతి అంటేనే మాతృత్వం

మాతృత్వం అంటేనే ప్ర‌కృతి.. ప్ర‌కృతి అంటేనే మాతృత్వం

ఈ ప్ర‌పంచంలో త‌ల్లి వెచ్చ‌ని కౌగిలింత కంటే ఏదీ గొప్ప‌ది కాదు. అవునా?  కాదా? అంటే ప్ర‌తిఒక్క‌రూ అవున‌నే చెప్తారు. ఎందుకంటే త‌ల్లి ఎవ‌రికైనా తల్లే క‌దా. బ‌య‌ట ఎన్ని ఇబ్బందులు ప‌డుతున్నా ఇంటికి వ‌చ్చి అమ్మ‌ను గ‌ట్టిగా కౌగిలించుకుంటే అన్నీ ఇట్టే మ‌ర్చిపోతారు. మైండ్ రీఫ్రెష్ అవ‌డంతో పాటు మంచి అనుభూతి పొందుతారు. అంత శ‌క్తి ఉంటుంది అమ్మ కౌగిలింత‌కు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనేగా.. చెప్పుకునే టైం వ‌చ్చింది. 

కోలా అనే జంతువు త‌న బిడ్డ‌ను హ‌త్తుకున్న వీడియో 2 సెకండ్లు మాత్ర‌మే ఉన్న‌ప్ప‌టికీ ఇంట‌ర్‌నెట్‌లో వైర‌ల్‌గా మారింది. దీనిని ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్‌కు చెందిన సుధా రామెన్ పోస్ట్ చేశారు. 'ఒక తల్లి యొక్క ఆ వెచ్చని కౌగిలింత. కోయాలా తల్లి తన బిడ్డను కంగారూస్ లాగా పర్సులో తీసుకువెళుతుంది, సుమారు 6 నెలలు'‌ అనే క్యాప్ష‌న్‌ను జోడించారు. ఈ వీడియో అందుబాటులోకి వ‌చ్చిన కొద్ది గంట‌ల్లోనే దాదాపు 40 వేల మంది వీక్షించారు. వీడియో చూశాక 'సో క్యూట్' అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. 

 


logo