శనివారం 23 జనవరి 2021
National - Dec 29, 2020 , 13:44:57

ఒకే దేశం.. ఒకే మొబిలిటీ కార్డ్‌.. ఇదేంటో తెలుసా?

ఒకే దేశం.. ఒకే మొబిలిటీ కార్డ్‌.. ఇదేంటో తెలుసా?

న్యూఢిల్లీ: ఒకే దేశం.. ఒకే కార్డ్‌.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చాలా రోజులుగా చేస్తున్న నినాదం ఇది. ఇందులో భాగంగా సోమ‌వారం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్ మెట్రో కోసం ఆయ‌న నేష‌న‌ల్ కామ‌న్ మొబిలిటీ కార్డ్ (ఎన్‌సీఎంసీ) సేవ‌ల‌ను ప్రారంభించారు. ఈ కార్డు ద్వారా దేశ‌వ్యాప్తంగా ఉన్న మెట్రో రైళ్లు, ఇత‌ర ర‌వాణా వ్య‌వ‌స్థ‌ల ద్వారా ప్ర‌యాణించ‌డంతోపాటు షాపింగ్‌, ఇత‌ర కొనుగోళ్ల కోసం కూడా ఈ కార్డును ఉప‌యోగించ‌వ‌చ్చు. 

ఎన్‌సీఎంసీ ఏంటి?

- నేష‌న‌ల్ కామ‌న్ మొబిలిటీ కార్డ్ (ఎన్‌సీఎంసీ) అనేది ఒక ఆటోమేటిక్‌గా ఛార్జీలు వ‌సూలు చేసే ఒక వ్య‌వ‌స్థ‌.

- వ‌న్ నేష‌న్ వ‌న్ కార్డ్ పేరుతో దీనిని 2019, మార్చి 4న ఇండియాలో లాంచ్ చేశారు. 

- రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన నంద‌న్ నీలేక‌నీ క‌మిటీ ఈ ఎన్‌సీఎంసీని సిఫారసు చేసింది. 

- ఈ వ్య‌వ‌స్థ ద్వారా ఎన్‌సీఎంసీ స‌పోర్ట్ చేసే RuPay డెబిట్ కార్డు ఉప‌యోగించి ప్ర‌యాణికులు దేశంలో ఎక్క‌డైనా ప్ర‌యాణించ‌వ‌చ్చు. 

- ఈ కార్డును షాపింగ్‌, బ్యాంకింగ్ లావాదేవీలు, కొనుగోళ్ల కోసం కూడా వినియోగించ‌వ‌చ్చు. 

- ప్ర‌స్తుతానికి ఢిల్లీ మెట్రో నెట్‌వ‌ర్క్‌లో 2022 నాటికి ఈ ఎన్‌సీఎంసీ అందుబాటులోకి వ‌స్తుంది. 

- మెట్రోల్లో ప్ర‌యాణించ‌డానికి గ‌త 18 నెల‌ల్లో 23 బ్యాంక్‌లు జారీ చేసిన RuPay డెబిట్ కార్డుల‌ను స్వైప్ చేసేందుకు ఈ ఎన్‌సీఎంసీ వీలు క‌ల్పిస్తుంది.

- అన్ని కొత్త మెట్రో రైళ్ల‌లో ఈ ఎన్‌సీఎంసీ ద్వారానే పేమెంట్లు జ‌ర‌గ‌డం త‌ప్ప‌నిస‌రి చేశారు.

- ఆటోమేటిక్ ఫేర్ క‌లెక్ష‌న్ (ఏఎఫ్‌సీ) అని పిలిచే వ్య‌వ‌స్థ ద్వారా స్మార్ట్‌ఫోన్ సాయంతో ఈ ఎన్‌సీఎంసీ మెట్రో స్టేష‌న్ల లోనికి వెళ్లేందుకు, బ‌ట‌య‌కు వ‌చ్చేందుకు అనుమ‌తి ఇస్తుంది. 


ఇవి కూడా చ‌దవండి

దేవుడు శాసించాడు.. త‌లైవా త‌ప్పుకున్నాడు

కిడ్నాప్ చేసి.. మ‌తం మార్చి.. పాకిస్థాన్‌లో అరాచకం

ఇండియాలో కొత్త ర‌కం క‌రోనా.. హైద‌రాబాద్‌లో ఇద్ద‌రికి

జ‌య‌హో ర‌హానే.. ఈ పొట్టివాడు చాలా గ‌ట్టివాడే

బైడెన్ డిజిట‌ల్ స్ట్రాట‌జీ టీమ్‌లో క‌శ్మీరీ యువ‌తి


logo