శనివారం 30 మే 2020
National - May 12, 2020 , 12:18:41

నిస్సిగ్గుగా మోకరిల్లారు : ఎంపీ విజయసాయి రెడ్డి

నిస్సిగ్గుగా మోకరిల్లారు : ఎంపీ విజయసాయి రెడ్డి

అమరావతి : ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చర్యలపట్ల వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ ప్రమాదం నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు విశాఖ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ చంద్రబాబు నాయుడు కేంద్ర హోంశాఖకు విజ్ఞప్తి పెట్టుకున్న సంగతి తెలిసిందే. కేంద్రం ఆయనకు అనుమతి ఇవ్వని విషయం తెలిసిందే. దీనిపై ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. విధి ఎంత నిర్దయగా ఉంటుందంటే మోదీ గోబ్యాక్‌ అని ఫ్లెక్సీలు కట్టించిన వ్యక్తి, అమిత్‌ షా కుటుంబంతో దైవదర్శనానికి తిరుపతి వస్తే కాన్వాయ్‌పై రాళ్లేయించిన వ్యక్తి ఏడాది తిరగక ముందే నిస్సిగ్గుగా మోకరిల్లారన్నారు. వైజాగ్‌ వెళ్లడానికి అనుమతివ్వండని వేడుకున్నారని పేర్కొన్నారు.


logo