శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 15, 2020 , 17:41:45

బిహార్‌ బీజేపీ శాసనసభ నాయకుడిగా కిశోర్‌ ప్రసాద్‌

బిహార్‌ బీజేపీ శాసనసభ నాయకుడిగా కిశోర్‌ ప్రసాద్‌

పాట్నా : బిహార్‌ శాసనసభలో బీజేపీ నాయకుడిగా తారి కిశోర్‌ ప్రసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆ పార్టీ నేత సుశీల్‌కుమార్‌ మోదీ ఆదివారం తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నితీశ్‌ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి, అసెంబ్లీలో శాసనసభ పార్టీ నేతగా సుశీల్‌కుమార్‌ మోదీ కొనసాగారు. ఈ సందర్భంగా కిశోర్‌ ప్రసాద్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ, సంఘ్‌ పరివార్‌ 40 సంవత్సరా రాజకీయ జీవితంలో తనకు చాలా ఇచ్చాయని, మరెవరూ వాటిని అందుకోకపోవచ్చని, తనకు అప్పగించే బాధ్యతను నిర్వహిస్తానని చెప్పారు. అలాగే పార్టీ ఉప నాయకుడిగా ఎన్నికైన బెట్టియా ఎమ్మెల్యే రేణుదేవిని ఆయన అభినందించారు. రేణుదేవి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతకు ముందు ఎన్‌డీఏ సమావేశం కాగా.. సీఎంగా నితీశ్‌కుమార్‌ను నిర్ణయించగా.. ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇటీవల 243 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 125 సీట్లు గెలుచుకొని ఎన్డీఏ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.