శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 25, 2020 , 18:56:30

రోజూ రోప్ స్కిప్పింగ్ ఆడండి.. ఫిట్‌ ఇండియాను ప్ర‌మోట్ చేయండి: కిరెన్‌ రిజిజు

రోజూ రోప్ స్కిప్పింగ్ ఆడండి.. ఫిట్‌ ఇండియాను ప్ర‌మోట్ చేయండి: కిరెన్‌ రిజిజు

న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో కేంద్ర ప్ర‌భుత్వం 21 రోజులపాటు లాక్‌డౌన్ విధించింది. దీంతో దేశ ప్ర‌జ‌లంతా ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో కేంద్ర క్రీడ‌లు, యువ‌జ‌న వ్య‌వ‌హారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు దేశంలోని యువ‌తీయువ‌కుల‌కు ఒక ముఖ్య సూచ‌న చేశారు. లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌స్తుతం దేశ యువ‌త‌కు ఖాళీ స‌మ‌యం దొరికింద‌ని, ఈ ఖాళీ స‌మ‌యాన్ని యువ‌జ‌నులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు. 

ప్ర‌తి రోజు కొన్ని నిమిషాలైనా రోప్ స్కిప్పింగ్ ఆడుతూ ఫిట్ ఇండియా కార్య‌క్ర‌మాన్ని ప్ర‌చారం చేయాల‌ని కిరెన్ రిజిజు సూచించారు. తన సూచ‌న‌ను సాధ్య‌మైంత మందికి షేర్ చేయాల‌ని కూడా ఆయన కోరారు. అంతేకాదు ఆయ‌న రోప్ స్కిప్పింగ్ చేస్తున్న వీడియోను కూడా ట్విట్ట‌ర్లో పోస్ట్ చేశారు. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం.. మంత్రిగారు చెప్పిన‌ట్లు దేశంలోని యువ‌తీ యువ‌కులంతా రోప్ స్కిప్పింగ్ చేయండి.. ఫిట్ ఇండియా ప్రోగ్రామ్‌ను ప్ర‌మోట్ చేయండి.    


logo