సోమవారం 13 జూలై 2020
National - Jun 20, 2020 , 15:59:18

క‌రోనా ప్ర‌భావం పెరుగుతున్న‌ది బీ కేర్ ఫుల్‌: కిర‌ణ్‌బేడీ

క‌రోనా ప్ర‌భావం పెరుగుతున్న‌ది బీ కేర్ ఫుల్‌: కిర‌ణ్‌బేడీ

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి రోజురోజుకు పెరిగిపోతుండ‌టంపై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కిర‌ణ్‌బేడీ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అతి త‌క్క‌వ జ‌నాభా క‌లిగిన పుదుచ్చేరి లాంటి ప్రాంతాల్లోనే రోజుకు 30కి త‌గ్గ‌కుండా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయ‌ని కిర‌ణ్‌బేడీ చెప్పారు. పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది కూడా క‌రోనా మ‌హ‌మ్మారి బారినప‌డుతున్నార‌ని, ఇక మ‌న‌ల‌ను ఎవ‌రు కాపాడుతార‌ని ఆమె ప్ర‌శ్నించారు. 

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఎవ‌రికి వారు స్వీయ నియంత్ర‌ణ పాటించ‌డం కంటే త‌రుణోపాయం మ‌రోటి లేద‌ని కిర‌ణ్‌బేడీ చెప్పారు. ఏ మాత్రం అజాగ్ర‌త్త‌గా ఉన్నా క‌రోనా క‌బ‌లిస్తుంద‌ని, అందుకే ప్ర‌తి ఒక్క‌రూ చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఆమె సూచించారు. ప్ర‌తి ఒక్క‌రం ఎవ‌రికి వారు స్వీయ నియంత్ర‌ణ పాటించ‌డం ద్వారా మ‌న జీవితాల‌ను, జీవ‌న విధానాన్ని కాపాడుకోవ‌చ్చని కిర‌ణ్‌బేడీ చెప్పారు. 


logo