ఆదివారం 24 జనవరి 2021
National - Jan 01, 2021 , 16:03:39

2.5 కోట్ల క్రిప్టోక‌రెన్సీ మోసం.. కీల‌క నిందితుడు అరెస్టు

2.5 కోట్ల క్రిప్టోక‌రెన్సీ మోసం.. కీల‌క నిందితుడు అరెస్టు

న్యూఢిల్లీ: క్రిప్టోక‌రెన్సీ ప్ర‌మోట‌ర్‌గా చెలామ‌ణి అవుతున్న 60 ఏళ్లు ఉమేశ్ వ‌ర్మ‌ను ఢిల్లీలో అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి ఢిల్లీకి రాగానే అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు.  45 మంది వ‌ద్ద అత‌ను సుమారు 2.5 కోట్ల మోసానికి పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.  క్రిప్టోక‌రెన్సీ పేరుతో అత‌ను మోసానికి తెగించాడు.  ఢిల్లీకి చెందిన ఆర్థిక నేరాల శాఖ అత‌న్ని అదుపులోకి తీసుకున్న‌ది.  2018లో అత‌ను దుబాయ్‌కి పారిపోయాడు.  నిధుల దుర్వినియోగం కింద గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ 18వ తేదీన ఉమేశ్ వ‌ర్మ‌పై చీటింగ్ కేసు న‌మోదు అయ్యింది. డిసెంబ‌ర్ 17వ తేదీన రెవ‌న్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గోల్డ్ స్మ‌గ్లింగ్ కేసులో అరెస్టు చేశారు.  అయితే క్రిప్టోక‌రెన్సీ కేసులో..  ఉమేశ్‌తో పాటు అత‌ని కుమారుడు భ‌ర‌త్ వ‌ర్మ, ఇత‌రులు దోషులుగా ఉన్నారు.  ప్లూటో ఎక్స్‌చేంజ్ పేరుతో వారు క్రిప్టోక‌రెన్సీ సంస్థ‌లో పెట్టుబ‌డి పెట్టేవిధంగా ప్రోత్స‌హించారు.  నెలనెలా 20 నుంచి 30 శాతం రిట‌ర్న్స్ ఇస్తామ‌ని ఇన్వెస్ట‌ర్ల‌ను బోల్తా కొట్టించారు. చిట్ ఫండ్ త‌ర‌హాలో వ్యాపారం సాగించిన తండ్రీకొడుకులు ఓ ద‌శ‌లో జార‌స్ పేరుతో క్రిప్టో నాణాల‌ను కూడా జారీ చేశారు. 


logo