బుధవారం 15 జూలై 2020
National - Jun 17, 2020 , 20:10:21

సైనికుల మరణం బాధాకరం: మాయావతి

సైనికుల మరణం బాధాకరం: మాయావతి

లక్నో: చైనా బలగాల చేతిలో భారత్‌కు చెందిన కల్నల్‌తో సహా 20 మంది ఆర్మీ జవాన్లు చనిపోవడం బాధాకరమని బహుజన సమాజ్‌ పార్టీ అధినేత మాయావతి పేర్కొన్నారు. ఈ ఘటన తనను షాక్‌కు గురిచేసిందన్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం అత్యంత అప్రమత్త, అవగాహనతో ముందడుగు వేయాలని విజ్ఞప్తి చేశారు. 

‘చైనాతో ఉన్న సరిహద్దు వివాదాలను తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్న తరుణంలో అక్కడి బలగాల చేతిలో భారత కల్నల్‌తో సహా 20 మంది ఆర్మీ జవాన్లు చనిపోయారన్న వార్త నన్ను చాలా బాధించింది. ఇప్పుడే కేంద్ర సర్కారు అత్యంత అప్రమత్తతోపాటు అవగాహనతో దేశ ప్రయోజనం దిశగా అడుగులు వేయాలి’ అని ఆమె పేర్కొన్నారు. కేంద్రం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకం తనకుందన్నారు. దేశానికి సంబంధించిన ఇంచు భూమిని కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేమన్నారు. ఇలాంటి సున్నిత సమయాల్లో రాజకీయాలతో సంబంధం లేకుండా దేశమంతా ఐక్యంగా ఉండడం గొప్ప విషయమని ట్విట్టర్‌ ద్వారా ఆమె పేర్కొన్నారు.logo