గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 17:40:10

చెట్టుతో రంగుల‌రాట్నం ఎప్పుడైనా చూశారా? త‌యారు చేసింది ఈ బుడ‌త‌లే!

చెట్టుతో రంగుల‌రాట్నం ఎప్పుడైనా చూశారా? త‌యారు చేసింది ఈ బుడ‌త‌లే!

ఏదైనా కొత్త‌గా క‌నిపెట్టాలంటే ప‌ల్లెటూళ్లోకే సాధ్య‌మ‌వుతుంది. వీరికి ఏవీ అందుబాటులో ఉండ‌వు. ఆ అవ‌స‌రాలే ఆవిష్క‌ర‌ణ‌ల‌కు పునాది వేస్తాయి. మొన్న‌టికి మొన్న ఇటుక‌ల‌తో పూల్ టేబుల్ త‌యారు చేశారు. ఇప్పుడేమో ఏకంగా రంగుల‌రాట్నం త‌యారు చేశారు. దీనికి ఎలాంటి ప‌రిక‌రాలూ అవ‌స‌రం లేదు. ఒక చిన్న చెట్టు, తాళ్లు ఉంటే స‌రిపోతుంది. మెర్రీ గో రౌండ్ల‌ని ఏర్పాటు చేసేసుకున్నారు. ఈ ఐడియాకు నిటిజ‌న్లు ఫిదా అయ్యారు.

22 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ సుప్రియా సాహు ట్విట‌ర్‌లో పంచుకున్నారు. కొన్ని విషయాలు ఆనందానికి గురిచేస్తాయి. ఈ పిల్ల‌లు జీవిత పాఠాలు నేర్పుతున్నారు అనే శీర్షిక‌ను జోడించారు. ఇందులో ముగ్గురు పిల్ల‌లు త‌మ కోసం ఒక చెట్టుని రంగుల‌రాట్నంగా మార్చుకున్నారు. తాళ్ల‌ను చెట్టుకు స్ప్రింగ్‌లా క‌ట్టుకొని మొద‌ట నెమ్మ‌దిగా తిరుగుతూ ఆ త‌ర్వాత వేగం పెంచితే ఆ స్పీడ్‌కు గిరగిరా తిరుగుతారు. ఏదేమైనా ఈ పిల్ల‌ల తెలివితేట‌ల‌కు స‌లాం కొట్టాల్సిందే. 

  


logo