శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
National - Aug 13, 2020 , 16:53:53

ల‌క‌ల‌క చంద్ర‌ముఖి మంచాన్ని ఒంటి చేత్తో ఎత్తితే.. స్నాక్స్‌కోసం ఈ చిన్నారి ఏకంగా గేటునే ఎత్తేసింది!

ల‌క‌ల‌క చంద్ర‌ముఖి మంచాన్ని ఒంటి చేత్తో ఎత్తితే.. స్నాక్స్‌కోసం ఈ చిన్నారి ఏకంగా గేటునే ఎత్తేసింది!

చిన్న‌పిల్ల‌లు అడిగింది ఇవ్వ‌కుంటే ఎలాగైనా సాధించాల‌నుకుంటారు. అందుకోసం ఎంత‌సేపు అయినా ఎదురుచూస్తారు. ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఎక్క‌డ దాచిపెట్టినా వెతికి మ‌రీ క‌నుక్కుంటారు. అడ్డొస్తే వంటి చేత్తో ఎత్తేస్తారు. ఆ టైంలో వారి వంట్లోకి చంద్ర‌ముఖి వ‌స్తుందో ఏమో మ‌రి. ఈ చిన్నారిని చూస్తే అదే గుర్తొస్తుంది. స్నాక్స్ క‌నిపిస్తే చిన్నారి వ‌దిలిపెట్ట‌డం లేద‌ని వంట‌గ‌దిలో దాచిపెట్టింది త‌ల్లి. ఆ గ‌దికి త‌లుపు లేక‌పోవ‌డంతో ఒక గేటును కొని అడ్డుగా పెట్టింది.

అయితే ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఈ చిన్నారి గేటును చేత్తో నెట్టేసి లోప‌లికి చొర‌బ‌డింది. ఇంకేముంది ఎక్క‌డో రాక్‌లో దాచిపెట్టిన స్నాక్స్ మూట‌ను ప‌ట్టుకొని ప‌రుగో ప‌రుగు. మ‌ళ్లీ గేటును వేయ‌డం మాత్రం మ‌ర్చిపోలేదు. ఇంత‌కుముందు ఎలా ఉన్న‌దో అచ్చం అలానే పెట్టి అక్క‌డి నుంచి ప‌రార్ అయింది. ఈ వీడియోకు 'త‌న బిడ్డ‌ను వంట‌గ‌ది నుంచి దూరంగా ఉంచ‌డానికి ఒక గేట్ కొన్నాన‌ని ఆమె చెప్పింది' అనే శీర్షిక‌తో ట్విట‌ర్లో షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన వారంతా చంద్ర‌ముఖే గుర్తొస్తుంది అంటున్నారు. ఈ వీడియో నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతుంది. logo