మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 21:38:59

కియా సోనెట్‌ చిత్రాలను విడుదల చేసిన కియా మోటార్స్‌ ఇండియా

  కియా సోనెట్‌ చిత్రాలను విడుదల చేసిన కియా మోటార్స్‌ ఇండియా

 ఢిల్లీ: కియా మోటార్‌ కార్పోరేషన్‌ అనుబంధ సంస్థ అయిన కియా మోటార్స్‌ ఇండియా త్వరలో మార్కెట్‌లోకి విడుదల చేయనున్నకియా సోనెట్‌ వెహికిల్ ఎక్స్‌టీరియర్‌ , ఇంటీరియర్‌ చిత్రాలను గురువారం  విడుదల చేసింది. ఉత్పత్తికి సిద్ధమైన కియా సోనెట్‌లో  వైవిధ్యమైన సరికొత్త డిజైన్‌తో పాటు మరికొన్ని ఫీచర్లను అందిస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఆటో ఎక్స్‌పో 2020 లో పరిచయం చేసిన పూర్తి సరికొత్త కియా సోనెట్‌ను ఆగస్టు 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తొలిసారిగా విడుదల చేయనున్నారు.

  కంపాక్ట్‌ ఎస్‌యువీ విభాగంలో బోల్డ్‌ స్టేట్‌మెంట్‌ను ఇవ్వనున్నారు. నూతన కియా సోనెట్‌ ను రాజీలేకుండా సరికొత్త ఫీచర్లతో అందిస్తున్నామని , విభిన్నమైన రంగులు, మెటీరియల్స్‌ ఎంపికను సైతం అందించాము. భారతదేశవ్యాప్తంగా మా డిజైనర్లు కనుగొన్న సాంస్కృతిక వారసత్వపు స్ఫూర్తితో వీటిని తీర్చిదిద్దాము’’ అని‌ కియా డిజైన్‌ సెంటర్‌ – కియా మోటార్స్‌ కార్పోరేషన్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ హెడ్‌  కరీమ్‌ హబీబ్‌ అన్నారు.


logo