సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 16:05:56

నేను రోబోను కాదు: ‌కుష్బూ

నేను రోబోను కాదు: ‌కుష్బూ

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదించిన నూతన విద్యావిధానం-2020ని త‌మిళ‌నాడుకు చెందిన ప్ర‌ముఖ న‌టి, కాంగ్రెస్‌ నాయకురాలు ఖుష్భూ సుంద‌ర్ స్వాగ‌తించారు. అయితే అది తన వ్య‌క్తిగ‌త‌ అభిప్రాయం మాత్ర‌మేన‌ని, పార్టీ వైఖరి కాద‌ని స్పష్టంచేశారు. ఒక పౌరురాలిగా మాత్రమే త‌న అభిప్రాయం వెల్ల‌డించానని ఆమె ట్వీట్ చేశారు. అంతేగాక నూత‌న విద్యావిధానాన్ని స్వాగతించినందుకు రాహుల్‌‌గాంధీకి క్షమాపణలు చెబుతున్నాన‌ని కుష్బూ పేర్కొన్నారు. 

ప్రతిదానికి అధిష్ఠానం చెప్పిన‌ట్లు తలాడించడానికి తాను రోబోను కాద‌ని, అందుకే నిర్భ‌యంగా త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించాన‌ని కుష్బూ తెలిపారు. ప్రతీది నాయకుడి అంగీకారంతో మాట్లాడ‌టం కాద‌ని, పౌరులుగా మన వ్య‌క్తిగ‌త‌ అభిప్రాయాల‌ను ధైర్యంగా చెప్పగలుగాలని పేర్కొన్నారు. అయితే, ఆమె ట్వీట్‌పై పలువురు కాంగ్రెస్ మ‌ద్దతుదారులు, కార్యకర్తలు విమర్శలు చేస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo