ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 20:34:25

ఈ ఏడాది 21.2 శాతం పెరిగిన వానాకాలం సాగు

ఈ ఏడాది 21.2 శాతం పెరిగిన వానాకాలం సాగు

ఢిల్లీ :దేశంలో గురువారం నాటికి 338.3 మి.మీ వ‌ర్ష‌పాతం నమోదైంది. సిడ‌బ్ల్యుసి నివేదిక ప్రకారం సాధార‌ణ వ‌ర్ష‌పాతం 308.4 మి.మీ. కాగా.... దేశంలోని123 రిజ‌ర్వాయ‌ర్ల‌లో ప్ర‌త్య‌క్ష‌ నీటి నిల్వ అంత‌కు ముందు గతేడాదితో పోలిస్తే 150 శాతం అధికంగా ఉన్నది. గ‌త ప‌ది సంవ‌త్స‌రాల  స‌గ‌టు నీటి నిల్వ‌ను గ‌మ‌నిస్తే 133 శాతంగా  ఉంది.శుక్రవారం నాటికి మొత్తం వానాకాలం పంట‌లు 691.86ల‌క్ష‌ల హెక్టార్ల‌లో  నాట్లువేయ‌గా, గత సంవత్సరం ఇదే కాలంలో 570.86 ల‌క్ష‌ల హెక్టార్ల‌లోనాట్లు వేశారు. దీంతో ప్ర‌స్తుతం దేశంలో గ‌త ఏడాది కంటే 21.20 శాతం అధిక విస్తీర్ణంలొ నాట్లుప‌డిన‌ట్టు లెక్క‌. వానాకాలం పంట‌ల‌కు సంబంధించి నాట్లుప‌డిన విస్తీర్ణం కింది విధంగా ఉంది.

రైతులు వ‌రి 16.47 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో నాట్లువేయ‌గా గ‌త ఏడాది 142.06 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో నాట్లువేశారు. నాట్లుప‌డిన‌ విస్తీర్ణం పెరుగుద‌ల 18.59 శాతం.ప‌ప్పులు 81.66 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో నాట్లు వేయ‌గా గ‌త ఏడాది 61.70 ల‌క్ష‌ల హెక్టార్ల‌లోనాట్లువేశారు.  విస్తీర్ణంలో పెరుగుద‌ల 32.35 శాతం. ధాన్యాలు 115.60 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో వేయ‌గా గ‌త ఏడాది 103.00 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో వేశారు. విస్తీర్ణంలో పెరుగుద‌ల 12.23 శాతం . నూనె గింజ‌లు 154.95 ల‌క్ష‌ల ఎక‌రాల‌లో వేయ‌గా గ‌త ఏడాది 110.09 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో వేశారు.

విస్తీర్ణంలో పెరుగుద‌ల‌ 40.75 శాతం.చెర‌కు  51.29 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో వేయగా గ‌త ఏడాది 50.82 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో వేశారు. విస్తీర్ణంలో పెరుగుద‌ల 0.92 శాతం. ప‌త్తి 113.01 ల‌క్ష‌ల హెక్టార్ల విస్తీర్ణంలో వేయ‌గా గ‌త ఏడాది 96.35 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో వేశారు. విస్తీర్ణంలో పెరుగుద‌ల 17.28 శాతం. జ‌న‌ప‌నార‌, గోగు పంట‌లు 6.88 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో వేయ‌గా, గ‌త ఏడాది 6.84 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో వేశారు. విస్తీర్ణంలో పెరుగుద‌ల 0.70 శాతం.అందువ‌ల్ల ప్ర‌స్తుతానికి దేశంలో వానాకాలం పంట‌ల సాగు విస్తీర్ణం పెరుగుద‌ల‌పై  కోవిడ్ -19 ప్ర‌భావం కనిపించకపోవడం శుభపరిణామం. 


logo