బుధవారం 03 జూన్ 2020
National - May 13, 2020 , 19:39:34

ఖాదీ పరిశ్రమలతో అధిక ఉపాధి కల్పన : నితిన్‌ గడ్కరీ

ఖాదీ పరిశ్రమలతో అధిక ఉపాధి కల్పన : నితిన్‌ గడ్కరీ

ఢిల్లీ : ఖాదీ పరిశ్రమలతో అధిక ఉపాధి కల్పన జరగనున్నట్లు కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. కరోనా కారణంగా దేశంలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఉపాధి కల్పనపై నితిన్‌ గడ్కరీ మాట్లాడారు. ఖాదీని మనం అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉందన్నారు. ఖాదీ పరిశ్రమలు మరింత ఉపాధి సామర్థ్యాన్ని సృష్టించబోతున్నాయన్నారు.  ఖాదీ, గ్రామీణ పరిశ్రమలు వెనుకబడిన ప్రాంతాల్లో గరిష్ట ఉపాధిని కల్పిస్తాయన్నారు. గ్రామీణ కూలీలకు ఇది గొప్ప అవకాశంగా మారుతుందన్నారు. ముఖ్యంగా గిరిజన, గ్రామీణ, వ్యవసాయ రంగాల్లో పనిచేస్తున్నవారికి ఇది గొప్ప విజయవకాశంగా ఉంటుందన్నారు. కావునా ఖాదీని ప్రోత్సహించడం గ్రామీణ పరిశ్రమలకు మంచి ప్రోత్సహకంగా ఉంటుందన్నారు. 


logo