మంగళవారం 26 జనవరి 2021
National - Dec 19, 2020 , 16:48:55

కాంగ్రెస్‌ పార్టీకి రుచి గుప్తా రాజీనామా

కాంగ్రెస్‌ పార్టీకి రుచి గుప్తా రాజీనామా

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగమైన నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్త కార్యదర్శి ఇంచార్జ్‌ రుచి గుప్తా రాజీనామా చేశారు. సంస్థాగత మార్పులకు జాప్యం కారణంగానే పార్టీని వీడుతున్నట్లు ఆమె తెలిపారు.  ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ దీనికి కారణమని ఆమె ఆరోపించారు. రాహుల్‌ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన నియమించిన రుచి గుప్తా ఈ మేరకు శనివారం ఒక బహిరంగ లేఖ రాశారు. పార్టీ నాయకత్వం లోటును రాహుల్‌ గాంధీ మాత్రమే భర్తీ చేయగలని పేర్కొన్నారు. కాగా పార్టీ నాయకత్వంపై సీనియర్‌ నేతలు వ్యక్తం చేసిన అసంతృప్తిపై సోనియా గాంధీ శనివారం కీలక సమావేశం నిర్వహించిన రోజునే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రుచి గుప్తా వెల్లడించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి


logo