బుధవారం 20 జనవరి 2021
National - Nov 28, 2020 , 01:33:07

తృణమూల్‌లో భారీ కుదుపు.. కీలక నేత రాజీనామా

తృణమూల్‌లో భారీ కుదుపు.. కీలక నేత రాజీనామా

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పశ్చిమబెంగాల్‌ రవాణా శాఖ మంత్రి సువేందు అధికారి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు గురువారం తన రాజీనామా లేఖను ఫ్యాక్స్‌ ద్వారా ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పంపారు. అలాగే గవర్నర్‌కు కూడా ఈమెయిల్‌ చేశారు. 2011లో మమత అధికారంలోకి రావడానికి ముఖ్య కారణమైన ‘నందిగ్రామ్‌ ఉద్యమం’లో సువేందు కీలకపాత్ర పోషించారు. కొంతకాలంగా పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఆయన బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


logo