సోమవారం 01 జూన్ 2020
National - May 15, 2020 , 18:32:11

విశాఖ నౌకాదళ గూఢచర్యం కేసులో ప్రధాన కుట్రదారుడు అరెస్టు

విశాఖ నౌకాదళ గూఢచర్యం కేసులో ప్రధాన కుట్రదారుడు అరెస్టు

ఢిల్లీ : విశాఖ నౌకాదళ రహస్యాల గూఢచర్యం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ప్రధాన కుట్రదారుడిని అరెస్ట్‌ చేసింది. గూడఛర్యం కేసులో ముంబయికి చెందిన మహ్మద్‌ హరూన్‌ హాజీ ప్రధాన కుట్రదారుడిగా ఉన్నాడు. ఇతడిని ఎన్‌ఐఏ శుక్రవారం అరెస్టు చేసింది. యుద్ధనౌకలు, జలాంతర్గాముల రహస్యాలను పాకిస్థాన్‌ ఇంటలిజెన్స్‌ ఏజెన్సీ(ఐఎస్‌ఐ) కి చేరవేస్తున్నాడని ఇతడిపై ఆరోపణ. గూఢచర్యం కేసులో నౌకదళ సిబ్బంది సహా 11 మందిని ఎన్‌ఐఏ అరెస్టు చేసింది.


logo