మంగళవారం 04 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 17:25:50

కవలలకు జన్మనిచ్చిన కరోనా పేషెంట్

కవలలకు జన్మనిచ్చిన కరోనా పేషెంట్

తిరువనంతపురం : షార్జా నుంచి ఇటీవల కేరళకు తిరిగొచ్చిన కరోనా వైరస్ పాజిటివ్ గర్బిణి.. పండంటి కవలలకు జన్మనిచ్చింది. తల్లితోపాటు బాబులిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. వారికి కరోనా వైరస్ సోకలేదని దవాఖాన వర్గాలు తెలిపాయి. 

ఎనిమిదేండ్ల క్రితం వివాహమైన ఒక జంట పిల్లలు కాకపోవడంతో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ చేయించుకున్నారు. జూలై చివరి వారంలో కేరళకు వచ్చిన ఆ 32 ఏళ్ల గర్భిణి.. తన మొదటి ప్రసవం కోసం కన్నూర్ లోని పరియారం మెడికల్ కాలేజీ దవాఖానకు వెళ్ళింది. అయితే గర్భిణికి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో ఆమెను ప్రత్యేక గదిలో ఉంచి పర్యవేక్షించారు. వారం తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీ సెక్షన్ ద్వారా కవల అబ్బాయిలకు జన్మనిచ్చింది. చిన్నారులకు వైరస్ సోకలేదని, ముగ్గురూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యురాలు డాక్టర్ మాలిని రాఘవన్ చెప్పారు. పిల్లలు 2.25 కిలోలు, 2.35 కిలోల బరువుతో ఆరోగ్యంగా జన్మించారని తెలిపారు.

పరియారం మెడికల్ కాలేజీ దవాఖానలో ఇప్పటివరకు కరోనా వైరస్ సోకిన గర్భిణిలు 49 మంది కాన్పుచేయగా.. ఇది 50 వది కావడం విశేషం. అలాగే, కొవిడ్-19 కలిగి వుండి కవలలను ప్రసవించడం రాష్ట్రంలోనే ఇది మొదటిది కావడం మరో విశేషం. గర్భిణికి పాజిటివ్ ఉన్ననందున ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి కొవిడ్-19 ప్రోటోకాల్‌ను అనుసరించి వైద్యులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. 

ఆపరేషన్ చేసిన డాక్టర్ ఎస్ అజిత్ నేతృత్వంలోని వైద్యుల బృందాన్ని కేరళ రాష్ట్ర ఆరోగ్య మంత్రి కేకే శైలాజ అభినందించారు. "ఇది ఆరోగ్య కార్యకర్తలు చేసిన గొప్ప సేవకు ఒక ఉదాహరణ" అని ఆమె చెప్పారు.


logo