శనివారం 16 జనవరి 2021
National - Jan 02, 2021 , 01:13:39

స్వీపర్‌ నుంచి మండలాధ్యక్షురాలిగా!

స్వీపర్‌ నుంచి మండలాధ్యక్షురాలిగా!

కొల్లం, జనవరి 1: కేరళలో ఓ పార్ట్‌టైం స్వీపర్‌ మండలాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. పదేండ్లుగా తాను స్వీపర్‌గా పనిచేస్తున్న కార్యాలయంలోనే అధ్యక్ష హోదాలో కుర్చీ మీద కూర్చొని పాలన అందించనున్నారు. ఆమె పేరు ఆనందవల్లి. వయస్సు 46 ఏండ్లు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం పార్టీ నుంచి పోటీ చేశారు. 13 గ్రామాలున్న పథనపురం మండలం (బ్లాక్‌ పంచాయతీ)లోని థలవూర్‌ నుంచి గెలుపొందారు. సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎల్డీఫ్‌) ఆనందవల్లిని మండలాధ్యక్షురాలిని చేయాలని నిర్ణయించింది.