ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 16, 2020 , 17:51:57

సుప్రియ సేవను మెచ్చి.. ఇల్లు బహుమతిగా ఇచ్చిన జాయ్ ఆలుకాస్

సుప్రియ సేవను మెచ్చి.. ఇల్లు బహుమతిగా ఇచ్చిన జాయ్ ఆలుకాస్

తిరువనంతపురం : సరిగ్గా పది రోజుల క్రితం సోషల్ మీడియాలో వచ్చిన ఈ వీడియో గుర్తుందిగా. బస్సు వెనకాలే పరిగెత్తి ఆపి మరీ ఓ అంధుడిని బస్సు ఎక్కించిన మహిళ. ఆమె పేరు గత పది రోజులుగా సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. నెటిజెన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తన ఉద్యోగి సేవా గుణాన్ని మెచ్చిన యజమాని.. ఆమెకు ఒక ఇంటిని బహుమతిగా ఇచ్చారు. 

కేరళ తిరుపత్తూర్ జిల్లా పరిధిలోని తిరువల్లకు చెందిన సుప్రియ అనే మహిళ.. స్థానికంగా ఆలుకాస్ గ్రూపులో ఉద్యోగి. సుప్రియ సేవలను కొనియాడుతూ దేశవిదేశాల నుంచి నెటిజెన్లు ప్రశంసిస్తుండగా.. తాను కూడా అభినందించాలని భావించి ఆమె ఇంటికి వెళ్లారు ఆలుకాస్ గ్రూప్ చైర్మన్ జాయ్ ఆలుకాస్. చిన్న కిరాయి ఇంట్లో కుటుంబంతో గడుపుతున్న సుప్రియను కలిసి అభినందించన చైర్మన్.. వచ్చే వారం త్రిస్సూర్ కు రావాల్సిందిగా ఆమెను ఆహ్వానించారు. జాయ్ ఆలుక్కాస్ సూచన మేరకు త్రిస్సూర్ వెళ్లిన సుప్రియకు.. ఆమె ఆశ్చర్యపోయేలా ఇల్లును జాయ్ ఆలుకాస్ బహుమతిగా ఇచ్చారు. జాయ్ ఆలుకాస్ సతీమణి జొల్లి ఆలుకాస్ ఆమెను ఘనంగా సత్కరించారు.

పరిగెత్తుతూ వెళ్లి అంథుడిని బస్ ఎక్కించే వీడియోను తిరుపత్తూరు జిల్లాకు చెందిన ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఆమె ఈ ప్రపంచాన్ని జీవించడానికి మంచి ప్రదేశంగా మార్చారు. ఆమె చూపిన దయ ఎంతో అందమైనది.. అని కాప్షన్ జోడించారు. ఈ వీడియోకు నెటిజెన్లు ఫిదా అయ్యారు. ఆమెలాగెనే మనమంతా మన చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రేమిద్దాం అని బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ట్వీట్ చేశారు.logo