మంగళవారం 26 మే 2020
National - May 17, 2020 , 04:36:25

కేరళ పర్యాటక రంగానికి రూ.15 వేల కోట్లు నష్టం

కేరళ పర్యాటక రంగానికి రూ.15 వేల కోట్లు నష్టం

తిరువనంతపపురం: కేరళ పర్యాటక రంగానికి రూ. 15 వేల కోట్ల నష్టం వాటిల్లిందని ఆ రాష్ట్ర మంత్రి కదకంపల్లి సురేంద్రన్‌ తెలిపారు. రాష్ట్రంలోని పర్యాటక రంగాన్ని పునరుద్ధరించేందుకు ప్యాకేజీని తీసుకురావాలని యోచిస్తున్నాం. ఈ విషయంపై ఇప్పటికే ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసి ముఖ్యమంత్రికి అందజేశామని పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16 కరోనా పాజిటివ్‌ కేసులు రావడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 576కు చేరుకుందన్నారు. కరోనా బారిన పడి రాష్ట్రంలో ఇప్పటి వరకు నలుగురు మృత్యువాత పడ్డారని తెలిపారు. 


logo